logo

బస్సులు నడపాలని విద్యార్థుల ఆందోళన

పాఠశాల సమయాలకు బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, కొత్తూరు, రేగడమైలారం గ్రామాలతో పాటుగా గిరిజన తండాల విద్యార్థులు కొడంగల్‌ వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట

Published : 02 Jul 2022 02:04 IST

బొంరాస్‌పేట: పాఠశాల సమయాలకు బస్సులు నడపాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి, కొత్తూరు, రేగడమైలారం గ్రామాలతో పాటుగా గిరిజన తండాల విద్యార్థులు కొడంగల్‌ వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం పూట పాఠశాల సమయానికి బస్సులు లేకపోవడంతో ఆటోలో వెళ్లలేక అవస్థలు పడుతున్నట్లు వాపోతున్నారు. మూడు రోజుల క్రితం రాస్తారోకో చేయటంతో రెండు రోజుల్లో ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ బస్సులు లేకపోవటంతో శుక్రవారం నాగిరెడ్డిపల్లి విద్యార్థులు హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న కొడంగల్‌ సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌ అక్కడకు చేరుకుని శనివారం నాటికి పాఠశాల సమయానికి బస్సు నడిచేలా కృషి చేస్తామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని