logo

ప్రతిష్ఠాత్మక ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ల ప్రకటన

తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ).. పారిశ్రామిక, వాణిజ్య ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలకు ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’లు ప్రకటించింది. జులై 4న హెచ్‌ఐసీసీలో ప్రదానం చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని

Updated : 02 Jul 2022 06:52 IST

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ).. పారిశ్రామిక, వాణిజ్య ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన సంస్థలకు ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’లు ప్రకటించింది. జులై 4న హెచ్‌ఐసీసీలో ప్రదానం చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐ భవనంలో విలేకరుల సమావేశంలో ఎఫ్‌టీసీసీఐ సీఇఓ ఖ్యాతి నారవణే, పురస్కార కమిటీ ఛైర్‌ గౌర శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి అజయ్‌ మిశ్ర, ఎఫ్‌టీసీసీఐ ఉపాధ్యక్షులు మీలా జయదేవ్‌లతో కలిసి ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి మాట్లాడారు. ఎఫ్‌టీసీసీఐ ఈఏడాది 19 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. 

ఎక్స్‌లెన్స్‌ పురస్కార స్వీకర్తలు వీరే..

ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇండస్ట్రీయల్‌ ప్రొడక్టివిటీ పురస్కారం- హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌)కు. ‘ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆల్‌రౌండ్‌ పర్‌ఫార్మెన్స్‌’ పురస్కారాన్ని ‘మెట్రోకెమ్‌ ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్‌ (హైదరాబాద్‌)’కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆగ్రో బేస్డ్‌ ఇండస్ట్రీ- సామ్‌ అగ్రిటెక్‌ లిమిటెడ్‌ (హైదరాబాద్‌)కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మార్కెటింగ్‌ ఇన్నోవేషన్‌ పురస్కారం ‘బీఫాక్‌ 4్ఠ ప్రైవేటు లిమిటెడ్‌కు ప్రకటించారు. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ పురస్కారం ‘రవి ఫుడ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (రంగారెడ్డి జిల్లా), ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఎక్స్‌పోర్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ (మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజ్‌) పురస్కారం సర్వోత్తమ్‌ కేర్‌ లిమిటెడ్‌ (సికింద్రాబాద్‌)కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ పురస్కారం ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (సికింద్రాబాద్‌)కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌ పురస్కారం ‘స్కైషేడ్‌ డేలైట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (హైదరాబాద్‌)కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌ (మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజ్‌) పురస్కారం కాన్వర్జ్‌ బయోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (హైదరాబాద్‌)కు అందజేస్తారు. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్నోవేటివ్‌ ప్రాడక్ట్‌/సర్వీస్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌ విత్‌ హయ్యెస్ట్‌ ఇపాక్ట్‌ పురస్కారం ‘క్లిక్‌2క్లీనిక్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పురస్కారం ‘మైత్రి డ్రగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజ్‌) పురస్కారం ‘సహస్రా క్రాప్‌ సైన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌’కు, ఔట్‌స్టాండింగ్‌ కాంట్రిబ్యూషన్‌ టు ది ఏరోస్పేస్‌ అండ డిఫెన్స్‌ ఇండస్ట్రీ పురస్కారాన్ని ‘అనంత టెక్నాలజీస్‌ లిమిటెడ్‌కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్‌ఫర్మెషన్‌ టెక్నాలజీ (ఐటీ) పురస్కారం వివిధ్‌మైండ్స్‌ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ టూరిజం ప్రమోషన్‌ పురస్కారం సురేంద్ర అసోసియేట్స్‌ (సురేంద్రపురి)కు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ అసోసియేషన్‌/ఛాంబర్‌ ఫర్‌ సర్వీసింగ్‌ ఇండస్ట్రీ , కామర్స్‌ అండ్‌ ఎకానమి పురస్కారం సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (హైదరాబాద్‌)కు ఇస్తారు. ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సైన్స్‌ ఆర్‌ ఇంజనీరింగ్‌ రంగంలో డా.ఇబ్రామ్‌ గణేష్‌ సైంటిస్ట్‌-ఎఫ్, ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసర్చి సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్గి అండ్‌ న్యూ మెటీరియల్స్‌కు, ఔట్‌స్టాండింగ్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రేన్యూర్‌గా ఆన్‌ఛెంట్‌ కెఫే అండ్‌ కాన్ఫిక్షనరీ వ్యవస్థాపకురాలు దీపా దాదుకు, ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఇనిషియేటివ్‌ ఫర్‌ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ పురస్కారాన్ని నవభారత్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (భదాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ)కు పురస్కారాలను అందజేస్తారు. జులై 4న సాయంత్రం 4 గంటలకు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా ప్రదానం చేయడం జరుగుతుందని భాస్కర్‌రెడ్డి వెల్లడించారు. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌రంజన్‌ విశిష్ట అతిథిగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని