logo

తూర్పు, ఉత్తరాన వాన

నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమ నగరం వైపు కమ్ముకున్న మేఘాలు క్రమంగా ఉత్తరం మీదుగా తూర్పు వైపు కదలడంతో ఆయా ప్రాంతాల్లో జోరు వాన కురిసింది.

Published : 03 Jul 2022 03:26 IST

తెలుగు తల్లి పైవంతెన వద్ద పడుతున్న వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమ నగరం వైపు కమ్ముకున్న మేఘాలు క్రమంగా ఉత్తరం మీదుగా తూర్పు వైపు కదలడంతో ఆయా ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కుత్బుల్లాపూర్‌, అల్వాల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఈ ప్రభావం కన్పించింది. గాలులు వీయడంతో అనేక ప్రాంతాల్లో అర గంట నుంచి గంట పాటు విద్యుత్తు సరఫరా నిల్చిపోయింది. మియాపూర్‌ లక్ష్మీనగర్‌ కాలనీలో 3 గంటల పాటూ కరెంటు లేదని వినియోగదారుడు రవి ఫిర్యాదు చేశారు.
నేడు వర్ష సూచన.. నగరంలో ఆదివారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.


వర్షపాతం (మిల్లీ మీటర్లలో)
గాజులరామారం 26.3
జీడిమెట్ల 23.0
షాపూర్‌నగర్‌ 22.0
అల్వాల్‌ 19.5
మౌలాలి 17.8
కుత్బుల్లాపూర్‌ 17.3
నేరేడ్‌మెట్‌ 16.0
హైదర్‌నగర్‌ 12.5
కాప్రా 11.5
తిరుమలగిరి 11.0

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని