vaccination : టీకానా.. మాకొద్దు
కరోనా వ్యాక్సిన్ పట్ల కొన్ని ప్రైవేటు బడులు విముఖత చూపుతున్నాయి. కొన్ని యాజమాన్యాలైతే టీకా అవసరం లేదంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నాయి. 12 ఏళ్లు దాటిన బాలబాలికలకు కరోనా టీకా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.
అంగీకారం తెలపని ప్రైవేటు పాఠశాలలు 230పైనే
ఈనాడు, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ పట్ల కొన్ని ప్రైవేటు బడులు విముఖత చూపుతున్నాయి. కొన్ని యాజమాన్యాలైతే టీకా అవసరం లేదంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాన్ని చెబుతున్నాయి. 12 ఏళ్లు దాటిన బాలబాలికలకు కరోనా టీకా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక డ్రైవ్‌లు పెట్టి టీకాలు అందిస్తున్నారు. అదే సమయంలో ప్రైవేటు, కార్పొరేట్ బడుల్లోని పిల్లలకూ టీకా ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. చాలా ప్రైవేటు యాజమాన్యాలు తమ పాఠశాలలో చదువుతున్న వారికి ఇప్పించేందుకు ముందుకు రావడంలేదు. ఇందుకు రకరకాల కారణాలు చెబుతున్నారు. తల్లిదండ్రులు నుంచి అనుమతి తీసుకున్నాకే.. దీనిపై నిర్ణయం తీసుకుంటామని కొన్ని యాజమాన్యాలు చెబుతుండగా.. మరికొందరు టీకా అవసరం లేదని నేరుగానే అధికారుల దృష్టికి తీసుకెళ్తునారు. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో దాదాపు 230పైన ప్రైవేటు బడులు ఇప్పటికే టీకా పట్ల తమ అయిష్టత ప్రకటించాయని అధికారులు తెలిపారు. మరోవైపు పాఠశాలల నుంచి సానుకూలత వస్తే తప్ప బలవంతంగా టీకా ఇచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కచ్చితంగా టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటి నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు నగర డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బీఏ4, బీఏ5 వేరియంట్లతో చాలామంది కొత్తగా కరోనా బారిన పడుతున్నారు. స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ భవిష్యత్తులో వైరస్ గతి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ తరుణంలో 12 ఏళ్లు నుంచి ఆపై వయస్సు వారంతా రెండు డోసులు టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Viral Video: ఉదయనిధి స్టాలిన్ సమక్షంలోనే పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి
-
Sports News
Women T20 World Cup: మహిళా సభ్యులతో తొలిసారిగా ప్యానెల్..భారత్ నుంచి ముగ్గురికి చోటు
-
Technology News
Indus Royal Game: వీర్లోక్లో మిథ్‌వాకర్స్ పోరాటం.. దేనికోసం?
-
Viral-videos News
Ranbir Kapoor: అభిమాని సెల్ఫీ కోరిక.. కోపంతో ఫోన్‌ను విసిరేసిన రణ్‌బీర్!
-
General News
‘ట్విటర్ పే చర్చా..’ ఆనంద్ మహీంద్రా, శశి థరూర్ మధ్య ఆసక్తికర సంభాషణ!
-
Politics News
JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!