logo

అమాయకులను మోసం చేస్తున్న..కాల్‌సెంటర్‌ గుట్టురట్టు

సైబర్‌ దొంగల ఆటకట్టించేందుకు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు కంకణబద్ధులయ్యారు. బ్యాంక్‌ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల లిమిట్‌ పెంచుతామంటూ.. ప్రజలను మోసం చేస్తున్న ఝార్ఖండ్‌ ముఠాను కొన్నాళ్ల కింద

Published : 03 Jul 2022 03:54 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: సైబర్‌ దొంగల ఆటకట్టించేందుకు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు కంకణబద్ధులయ్యారు. బ్యాంక్‌ ఖాతాల కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల లిమిట్‌ పెంచుతామంటూ.. ప్రజలను మోసం చేస్తున్న ఝార్ఖండ్‌ ముఠాను కొన్నాళ్ల కింద అరెస్టుచేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం మరో ముఠాను  దిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ముఠా దేశ రాజధానిలో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ఏర్పాటుచేసి, అమాయకులకు ఫోన్లు చేసి డబ్బు దండుకుంటున్నారని పోలీసుల విచారణ వెల్లడైంది. ముఠాలోని 10 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ సైబర్‌ కేటుగాళ్లను నగరానికి తీసుకొస్తారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని