logo

బస్సుపై తెగి పడిన విద్యుత్తు తీగలు

ఆర్టీసీ బస్సును చెట్టును ఢీకొనడంతో అది విరిగి బస్సుపైనే పడింది. చెట్టు కొమ్మల్లో ఉన్న విద్యుత్తు తీగలు సైతం తెగి దానిపై పడ్డాయి. ఎర్తింగ్‌ జరిగి చెట్టుతోపాటు

Published : 03 Jul 2022 03:54 IST

తప్పిన పెను ప్రమాదం

చెట్టు కొమ్మల తొలగింపు పనులు

నాగోలు, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సును చెట్టును ఢీకొనడంతో అది విరిగి బస్సుపైనే పడింది. చెట్టు కొమ్మల్లో ఉన్న విద్యుత్తు తీగలు సైతం తెగి దానిపై పడ్డాయి. ఎర్తింగ్‌ జరిగి చెట్టుతోపాటు బస్సుకూ, పక్కనే ఉన్న ఇంటిగేటుకూ విద్యుత్తు ప్రవహించింది. ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బస్సు దిగటంతో పెను ప్రమాదం తప్పింది. కొత్తపేట డివిజన్‌లోని న్యూసమతాపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. నాగోలు చౌరస్తాలో కొనసాగుతున్న పైవంతెన నిర్మాణం పనుల కారణంగా ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు పోలీసులు కొత్తపేట నుంచి నాగోలు చౌరస్తాకు చేరుకొనే వాహనాలను కూడలి కంటే 200 మీటర్ల ముందు సమతాపురి కాలనీ వీధుల్లోంచి ఇన్నర్‌ రింగు రోడ్డుకు వెళ్లేలా దారి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఓ వీధిలో వంగి ఉన్న చెట్టును బండ్లగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. చెట్టు విరిగి భారీ కొమ్మలతో పాటు, వాటిలో నుంచి వెళ్తున్న విద్యుత్తు తీగలు బస్సుపై పడ్డాయి. కార్పొరేటర్‌ పవన్‌కుమార్‌ హుటాహుటిన అక్కడికి చేరుకొని, అధికారులతో మాట్లాడి విద్యుత్తు సరఫరా నిలిపేయించారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రప్పించి చెట్టు కొమ్మలు కోయించి మార్గం సుగమం చేయించారు. ప్రమాదం నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటుచేయాలని డీసీ కృష్ణయ్యను కార్పొరేటర్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని