logo

గో మహా నిరసన యాత్రను అడ్డుకున్న పోలీసులు

గోవును జాతీయ ప్రాణిగా ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ తలపెట్టిన గో మహా నిరసన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రకటన చేయాలని కోరుతూ

Published : 03 Jul 2022 03:54 IST


నిరసన తెలుపుతున్న శివకుమార్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: గోవును జాతీయ ప్రాణిగా ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కె.శివకుమార్‌ తలపెట్టిన గో మహా నిరసన యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రకటన చేయాలని కోరుతూ శివకుమార్‌  బాటసింగారం సమీప జాఫర్‌గూడలోని గో మహా క్షేత్రం నుంచి గో రక్షకులు, గోవులతో నొవాటెల్‌ వరకు నిరసన యాత్ర చేపట్టేందుకు శనివారం ఉదయం సిద్ధమయ్యారు. పోలీసులు గో మహా క్షేత్రం వద్ద మోహరించి ఉదయం యాత్ర బయలుదేరకుండా గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో శివకుమార్‌ గో రక్షకులతో కలిసి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేపట్టకుండా అణిచివేయడం దారుణమని, మోదీ ప్రధాని అయి ఏనిమిదేళ్లవుతున్నా.. ఇప్పటికీ గోవులపై నోరు మెదపడం లేదని ఆరోపించారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించే వరకు యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో తన పోరాటËం కొనసాగిస్తానన్నారు.
కాచిగూడ: గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి సంరక్షించాలని కాచిగూడలోని తెలంగాణ గో సంరక్షణ సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఈ విషయంపై శనివారం తెలంగాణ లవ్‌ఫర్‌ కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే జైన్‌, ముఖేశ్‌ చౌహాన్‌, నిషితా దీక్షిత్‌, అవినాశ్‌ దేవ్‌డా.. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌, కేంద్ర మాజీ మంత్రులు రవిశంకర్‌ప్రసాద్‌, ప్రకాశ్‌ జావడేర్‌లను నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో కలిసి వినతిపత్రాలు అందజేశారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని