logo

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో బాలికలకు వేధింపులు

ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో బాలికను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రాము కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామ్‌నగర్‌కు చెందిన మేక పృథ్వీ(24) ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు.

Published : 03 Jul 2022 04:13 IST

నాగోలు, న్యూస్‌టుడే: ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాతో బాలికను వేధింపులకు గురి చేస్తున్న యువకుడిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రాము కథనం ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని రామ్‌నగర్‌కు చెందిన మేక పృథ్వీ(24) ఇంటర్మీడియట్‌ వరకు చదివాడు. ఓ ప్రైవేటు సంస్థలో ఆఫీస్‌బాయ్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి రెవెన్యూ శాఖలో అధికారిగా ఉన్నాడు. చెడు అలవాట్లకు బానిసైన పృథ్వి.. అమ్మాయిల పేరిట ఫేక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచి బాలికలకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతున్నాడు. వారు యాక్సెప్ట్‌చేస్తే స్నేహం నటించి వారి వాట్సాప్‌ నంబర్లు, ఫొటోలు సేకరించి అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి వారికే పంపేవాడు. వారి నగ్న చిత్రాలు పంపాలని బెదిరించేవాడు. నిరాకరిస్తే ఆ చిత్రాలను వారి సంబంధీకులందరి వాట్సాప్‌ల్లో పోస్టు చేసి వేధింపులకు గురిచేసేవాడు. జనగామ జిల్లాకు చెందిన ఓ బాలికను ఇలా కొంతకాలంగా వేధించసాగాడు. ఆమె స్పందించడం మానేసి నగరానికి రావడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి బెదిరించడంతోపాటు, బాలిక గ్రామంలోని వారికి సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి పెట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలు సేకరించి పాల్వంచకు వెళ్లి నిందుతుణ్ని అరెస్టు చేసి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని