logo

అప్పుల బాధతో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం

ఊరిలో పేరుకుపోయిన అప్పులు.. వాటిని తీర్చేందుకు ఏదైనా ఉద్యోగం చేద్దామని నగరానికి వచ్చాడు.. మూడు నెలలుగా ఎక్కడా కొలువు దొరకలేదు. విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించసాగాడు.. అది చూసిన పోలీసులు ఒక్క ఉదుటున వెళ్లి కాపాడారు.

Published : 03 Jul 2022 04:13 IST

చెట్టుకు ఉరి తాడు బిగిస్తుండగా కాపాడిన పోలీసులు

సికింద్రాబాద్‌, న్యూస్‌టుడే: ఊరిలో పేరుకుపోయిన అప్పులు.. వాటిని తీర్చేందుకు ఏదైనా ఉద్యోగం చేద్దామని నగరానికి వచ్చాడు.. మూడు నెలలుగా ఎక్కడా కొలువు దొరకలేదు. విరక్తి చెంది ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించసాగాడు.. అది చూసిన పోలీసులు ఒక్క ఉదుటున వెళ్లి కాపాడారు. ఓ స్కూల్‌లో టీచర్‌గా ఉద్యోగం ఇప్పించేలా హామీ ఇచ్చారు. చిలకలగూడ ఠాణా పరిధిలో శనివారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌కు చెందిన నాగరాజు(32) ఎంఏ బీఈడీతోపాటు పీహెచ్‌డీ చేశాడు. అక్కడ సరైన ఉద్యోగం దొరకపోవడం, అప్పులు పేరుకుపోవడంతో నగరానికి వచ్చాడు. సీతాఫల్‌మండిలోని ఉప్పర్‌బస్తీలో తెలిసినవారి వద్ద ఉండి ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో చిలకలగూడ మైదానంలోని ఓ చెట్టుకు ఉరివేసుకునేందుకు చీర ముడివేశాడు. సమీపంలోని ఠాణా కిటికీ నుంచి అది గమనించిన హోంగార్డులు కృష్ణ, రాజవర్ధన్‌రెడ్డి ఒక్క ఉదుటున అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. నాగరాజును స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ అతని వివరాలు తెలుసుకుని, కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వెంటనే వారాసిగూడలోని సెయింట్‌ జాన్సన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ అంకం శ్రీకాంత్‌ను పిలిపించి, టీచర్‌గా అవకాశమిచ్చి ఆదుకోవాలని సూచించారు. స్పందించిన ఆయన ఉద్యోగం ఇవ్వడంతోపాటు తగినంత వేతనాన్ని ఇస్తానని శ్రీకాంత్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని