logo

రైల్వే విధ్వంసం నిందితులకు రెండు రోజుల కస్టడీ

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్‌ 17న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించి అరెస్టయిన నిందితులను రైల్వే పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు

Published : 03 Jul 2022 03:59 IST

నిందితులను వాహనంలో తరలిస్తున్న రైల్వే రక్షణ దళం

చంచల్‌గూడ, రెజిమెంటల్‌ బజార్‌, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్‌ 17న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో విధ్వంసం సృష్టించి అరెస్టయిన నిందితులను రైల్వే పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉంటున్న 45 మంది నిందితుల రెండు రోజుల కస్టడీకి రైల్వే న్యాయస్థానం అనుమతించింది. ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం  జైలు అధికారులకు చేరాయి. నిందితులు 45 మంది ఉండటంతో రైల్వే పోలీసులు భారీ బందోబస్తుతో రెండు ప్రత్యేక వాహనాల్లో శనివారం ఉదయం తీసుకెళ్లారు.ఈ సంఘటనలో రెండో దఫా, మూడో దఫా అరెస్టయిన ఏ2 నిందితుడు పృథ్వీరాజ్‌ రాథోడ్‌, మరో కీలక నిందితుడు ఆవుల సుబ్బారావుతో సహా 12 మంది చంచల్‌గూడ జైల్లోనే జ్యుడిషియల్‌ కస£్టడీలో ఉన్నట్లు సమాచారం.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని