logo

భాగ్యనగరాన.. భాజపా ప్రతిన

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంస్థాగత సంబరాలుగా భావించే వీటి కోసం ఆ పార్టీ తెలంగాణ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ఆ పార్టీ అగ్ర]  నేతలతో నగరం కళకళలాడింది.

Updated : 03 Jul 2022 05:51 IST

 తరలొచ్చిన భాజపా అతిరథులు

రాజధానిలో కాషాయ కళ

కమలం.. మా బలం: ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి తరలొచ్చిన భాజపా కార్యకర్తలు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంస్థాగత సంబరాలుగా భావించే వీటి కోసం ఆ పార్టీ తెలంగాణ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా తరలివచ్చిన ఆ పార్టీ అగ్ర నేతలతో నగరం కళకళలాడింది.
విజయ సంకల్ప సభకు పార్కింగ్‌ ప్రాంతాలు
విజయ సంకల్ప సభకు వస్తున్న అగ్రనేతలు, కార్యకర్తల వాహనాలను నిలిపేందుకు వీలుగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా పార్కింగ్‌ ప్రాంతాలను ఎంపిక చేశారు.
* కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలు హాకీ మైదానంలో తమ వాహనాలను నిలపాలి. అక్కడి నుంచి ధోబీఘాట్‌, బ్రూక్‌బ్రాండ్‌, టివోలీ, స్వీకార్‌-ఉప్‌కార్‌ మీదుగా బహిరంగ సభకు చేరుకోవాలి.

* ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు ఎన్‌సీసీ(బైసన్‌ పోలో గ్రౌండ్స్‌)మైదానంలో వాహనాలను నిలిపాలి.
*రంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట్‌, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్‌, యాదాద్రి జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు రైల్వే నిలయం మైదానం, తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో వాహనాలను నిలపాలి.
* రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు సంజీవయ్య పార్కు/బుద్ధభవన్‌/నెక్లెస్‌రోడ్‌/నల్లగుట్ట ప్రాంతాల్లో వాహనాలను నిలపాలి.
* నగరం భాజపా కార్యకర్తలు తమ వాహనాలను ఎన్టీఆర్‌ స్టేడియంలో నిలపాలి.     

    -ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని