logo

నిషేధిత పాలిథిన్‌ వాడితే భారీ జరిమానా

ప్లాస్టిక్‌ వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ వ్యాపారులను హెచ్చరించారు. శనివారం పలు దుకాణాలను

Published : 03 Jul 2022 04:13 IST

వస్త్ర దుకాణంలో తనిఖీలు చేస్తున్న కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌

పరిగి: ప్లాస్టిక్‌ వినియోగంలో ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌ వ్యాపారులను హెచ్చరించారు. శనివారం పలు దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 100 మైక్రాన్ల కంటే  తక్కువ ఉన్న వాటిని ప్రభుత్వం నిషేధించిందని, దీనిపై ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ఈ జాబితాలో అనేకం ఉన్నాయని వాటిని వినియోగించరాదని సూచించారు. నిబంధనలు పాటించకుంటే వ్యాపారులకు భారీ జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. ప్రజారోగ్యంపై ప్లాస్టిక్‌ తీవ్ర హానీ కలిగిస్తోందని ప్రజలు వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్లాస్టిక్‌ బదులుగా జ్యూట్‌ బ్యాగులు వాడాలన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని