logo

జక్కేపల్లిలో నమూనాల సేకరణ

యాలాల మండల పరిధిలోని జక్కేపల్లి గ్రామ శివారులో ఉన్న ఆర్‌బీఎల్‌ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల నమూనాలను అధికారులు శనివారం సేకరించారు. ఈ కంపెనీ సామర్థ్యం పెంచడానికి గత వారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా

Published : 03 Jul 2022 04:13 IST

రైతులతో మాట్లాడుతున్న  కాలుష్య నియంత్రణ మండలి అధికారి రామప్ప సిద్ది

యాలాల, న్యూస్‌టుడే: యాలాల మండల పరిధిలోని జక్కేపల్లి గ్రామ శివారులో ఉన్న ఆర్‌బీఎల్‌ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల నమూనాలను అధికారులు శనివారం సేకరించారు. ఈ కంపెనీ సామర్థ్యం పెంచడానికి గత వారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సందర్భంగా జక్కేపల్లి గ్రామానికి చెందిన రైతులు రాత్రి సమయంలో తీవ్ర దుర్వాసన వస్తోందని, పొలల్లో పంటలు పండడం లేదని వికారాబాద్‌ ఆర్డీఓ విజయకుమారి దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఆర్డీవో కాలుష్య నియంత్రణ మండలి, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో ఒక కమిటీని వేశారు. శనివారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రామప్ప సిద్ది, ఉప తహసీల్దార్‌ లక్ష్మణ్‌, వ్యవసాయ అధికారి యాదగిరి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. హాజీపూర్‌ గ్రామ శివారులో కంపెనీ ద్వారా వెలువడే కాలుష్యం తీవ్ర దుర్వాసనతో ఉంటోందని తద్వారా పంటలు పండడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జక్కేపల్లి గ్రామానికి చెందిన బసవయ్య మాట్లాడుతూ కంపెనీ నీరంతా తన పొలం పక్క నుంచి పోవడం ద్వారా పంట పండడం లేదన్నారు. వ్యవసాయ అధికారులు రైతుల పొలాల్లోని మట్టి నమునాలను, కాలుష్య నియంత్రణ అధికారులు నీటి నమూనాలను సేకరించారు. రామయ్య సిద్ది మాట్లాడుతూ... రైతులు తెలిపిన వివరాలను సేకరించామని, నివేదికను ఉన్నత అధికారులకు పంపిస్తామని తెలిపారు. సర్వేలో కాలుష్య నియంత్రణ అధికారి అనిల్‌, ఆర్‌ఐ నారాయణరెడ్డి, సర్వేయర్‌ మహేష్‌, జక్కేపల్లి రైతులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని