BJP: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా చేయాలి తప్ప ఇలానా?: భాజపా నేత ఇంద్రసేనారెడ్డి

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్‌ఐసీసీలో కలకలం రేగింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించారంటూ భాజపా నేతలు

Published : 03 Jul 2022 12:55 IST

హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న హెచ్‌ఐసీసీలో కలకలం రేగింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇంటెలిజెన్స్‌ అధికారులు సమావేశం హాల్లోకి ప్రవేశించారంటూ భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులను భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి గుర్తించారు.

ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మీడియాతో మాట్లాడారు. భాజపా సమావేశాలను చూసి ఓర్వలేక  రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. సమావేశంలో జరిగే చర్చ వివరాలను బయటకు చెప్పేందుకే నిఘా అధికారులు పోలీసు పాస్‌లతో లోనికి ప్రవేశించారన్నారు. తీర్మానాల కాపీని ఫొటో తీస్తుంటే గుర్తించి పోలీస్‌ కమిషనర్‌కు అప్పజెప్పామని.. ఫొటోలు డిలీట్‌ చేయించామని తెలిపారు. ఏ పార్టీ ప్రైవసీ వాళ్లకి ఉంటుందన్నారు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌ చేయాలి తప్ప ఇలా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని