logo

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ హెచ్చరించారు. రానున్న బక్రీద్‌ పండుగ నేపథ్యంలో ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం సంక్షేమ సంఘ ప్రతినిధులతో శాంతి సమావేశం నిర్వహించారు.

Published : 04 Jul 2022 03:57 IST


కార్యక్రమంలో మాట్లాడుతున్న శేఖర్‌గౌడ్‌

తాండూరు టౌన్‌, న్యూస్‌టుడే: శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ హెచ్చరించారు. రానున్న బక్రీద్‌ పండుగ నేపథ్యంలో ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం సంక్షేమ సంఘ ప్రతినిధులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఇదే సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశాంతమైన వాతావారణంలోనే పండుగలు చేసుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో వచ్చే తప్పుడు ప్రచారాలపై స్పందించరాదన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని స్పష్టం చేశారు. ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ‘మీరు మాకు రక్ష.. మేము మీకు రక్ష’ అనే నినాదంతో కలిసికట్టుగా ప్రజలకు రక్షణగా నిలుద్దామని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ, గ్రామీణ సీఐలు రాజేందర్‌రెడ్డి, రాంబాబు, ముస్లిం సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

యువత స్వయం ఉపాధితో రాణించాలి

తాండూరు గ్రామీణ: యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూడకుండా ఆసక్తి ఉన్న వ్యాపార, కుటీర, అంకుర పరిశ్రమలు వంటివి ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్‌ ఆకాంక్షించారు. పెద్దేముల్‌ మండలం ఖానాపూర్‌లో ఓ యువకుడు నెలకొల్పిన కిరాణా దుకాణాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సర్పంచి నర్సింహులు, వీఆర్‌ఏ అనిత తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని