logo

ముగిసిన రైల్వే స్టేషన్‌ విధ్వంసం నిందితుల కస్టడీ

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్‌ 17న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో అరెస్టయిన నిందితుల రెండు రోజుల జీఆర్పీ పోలీసుల కస్టడీ ఆదివారం ముగిసింది. 45 మంది నిందితులను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Published : 04 Jul 2022 03:57 IST

చంచల్‌గూడ జైలుకు తరలింపు


నిందితులను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్న జీఆర్పీ పోలీసులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా జూన్‌ 17న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో అరెస్టయిన నిందితుల రెండు రోజుల జీఆర్పీ పోలీసుల కస్టడీ ఆదివారం ముగిసింది. 45 మంది నిందితులను తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసుకు సంబంధించి, వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేసుకున్న విషయాలపై సమగ్రంగా విచారించడంతోపాటు ఎవరి ప్రోద్బలంతో విధ్వంసానికి పాల్పడాల్సి వచ్చిందనే దానిపై వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. రెండు రోజులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన జీఆర్పీ పోలీసులు ఆదివారం సాయంత్రం వరకు కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో తిరిగి 45 మందిని గాంధీ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆయన ఆదేశాలతో తిరిగి చంచల్‌గూడ జైలులో అప్పగించినట్లు సికింద్రాబాద్‌ రైల్వే అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని