logo

టైటిల్‌ డీడ్‌ పోగొట్టిన బ్యాంకుకు రూ.2 లక్షల జరిమానా

టైటిల్‌ డీడ్‌ పత్రాలు పోగొట్టడంతో పాటు సర్టిఫైడ్‌ కాపీలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు తీరుపై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు,

Published : 04 Jul 2022 03:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: టైటిల్‌ డీడ్‌ పత్రాలు పోగొట్టడంతో పాటు సర్టిఫైడ్‌ కాపీలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంకు తీరుపై హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-2 ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, సోమాజిగూడ శాఖను ఆదేశించింది. దోమల్‌గూడకు చెందిన డి.నగేశ్‌ ఆ బ్యాంకులో విశ్రాంత ఏజీఎం. అదే బ్యాంకులో 1990లో స్టాఫ్‌ హౌజింగ్‌ స్కీమ్‌లో భాగంగా గృహ రుణాన్ని తీసుకొని, టైటిల్‌ డీడ్‌లు అందజేశారు. రుణం తీరిపోవడంతో టైటిల్‌ డీడ్‌లు ఇవ్వాలని బ్యాంకును కోరారు. అవి దొరకలేదని, వెతికిస్తామని చెప్పి, ఎంతకీ ఇవ్వకపోవడంతో విసిగిపోయిన ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ బెంచ్‌, సర్టిఫైడ్‌ కాపీలు అందించడంలోనూ బ్యాంకు విఫలమైందని అభిప్రాయపడింది. ఒరిజినల్‌ టైటిల్‌ డీడ్‌ దుర్వినియోగం కాకుండా ఇండెమ్నిటీ లెటర్‌ ఫిర్యాదీ పక్షాన ఇవ్వాలని తెలిపింది. కేసు ఖర్చులు రూ.5 వేలు చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని