logo

వైభవంగా ఉజ్జయిని మహాకాళి జాతర ప్రారంభం

సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ వేదపండితులు వేణుమాధవశర్మ, రామకృష్ణశర్మ మహామండపంలో

Published : 04 Jul 2022 03:57 IST


ఘటం తయారీకి ఉపయోగించే సామగ్రి ప్రత్యేక పూజల్లో మంత్రి తలసాని

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ వేదపండితులు వేణుమాధవశర్మ, రామకృష్ణశర్మ మహామండపంలో గణపతిహోమం నిర్వహించారు. అనంతరం పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి స్వర్ణపుష్పార్చన జరిపారు. ఎదుర్కోళ్ల మహోత్సవాలకు అమ్మవారి పసుపు, కుంకుమ, ఆభరణాలు, సామగ్రికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అనువంశిక ధర్మకర్త సురిటి కామేశ్‌ కుటుంబ సభ్యులు, ఆలయ అధికారులు, కార్పొరేటర్‌ హేమ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లతో అమ్మవారి సామగ్రిని కర్బల మైదానానికి తీసుకెళ్లారు.

భారీ ఊరేగింపుతో.. కర్బల మైదానంలోని స్థానిక అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్ధంగా ఘటాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలతో ఘటం ఊరేగింపు సాయంత్రం దాటిన తరువాత ప్రారంభమైంది. డిస్టిల్లరీరోడ్డు, పాన్‌బజార్‌ ప్రాంతాల మీదుగా ఊరేగింపు సాగింది. ఎదుర్కోలు ఉత్సవంలో మహిళలు అడుగడుగునా హారతులు పట్టారు. పోలీసు బందోబస్తు మధ్య అమ్మవారి ఘటం ఆలయానికి చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని