Rain: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ

నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగోల్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కర్మాన్‌ ఘాట్‌, చంపాపేట, సంతోశ్‌ నగర్, సైదాబాద్, చాదర్ ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌....

Updated : 04 Jul 2022 20:24 IST

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఓయూ, తార్నాక, ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాగోల్, కొత్తపేట, చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్‌బీ నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కర్మాన్‌ ఘాట్‌, చంపాపేట, సంతోశ్‌ నగర్, సైదాబాద్, చాదర్ ఘాట్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌ నగర్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, పెద్దఅంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, తుర్కయంజాల్‌, మన్సూరాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం కురస్తుండటంతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలను బల్దియా అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప నగర వాసులు ఇంటి నుంచి బయటకు రావొద్దని జీహచ్‌ఎంసీ అధికారులు సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని