logo

నగరంలో కుండపోత

గ్రేటర్‌లో సోమవారం సాయంత్రం వరుణుడు విజృంభించాడు. ప్రధాన నగరంలో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, విద్యానగర్‌, బాగ్‌లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Published : 05 Jul 2022 01:21 IST

హైదర్‌గూడలోని పెట్రోల్‌ బంకు వద్ద నిలిచిన నీటిని

మ్యాన్‌హోల్‌లోకి మళ్లిస్తున్న బల్దియా సిబ్బంది

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో సోమవారం సాయంత్రం వరుణుడు విజృంభించాడు. ప్రధాన నగరంలో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్‌, రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, విద్యానగర్‌, బాగ్‌లింగంపల్లి, తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ, తార్నాక, సీతాఫల్‌మండి, చిలకలగూడ, ముషీరాబాద్‌, ఉప్పల్‌, నాగోల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో వాన కుండపోతగా కురిసింది. ఒక్కసారిగా కురవడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. రోడ్లపై నీరు నిలిచింది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది నీటి నిల్వలను దారి మళ్లించారు. రామంతాపూర్‌లో గరిష్ఠంగా 3.1సెం.మీ వర్షం కురవగా.. అంబర్‌పేటలో 1.85, నారాయణగూడ 1.7, బండ్లగూడ(హయత్‌నగర్‌) 1.68, జీడిమెట్ల 1.65, లింగోజిగూడ 1.58, షాపూర్‌నగర్‌ 1.53, ఆర్‌.సి.పురంలో 1.53 సెం.మీ వాన పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని