logo

రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కేసు.. కస్టడీకి మరో పది మంది

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన కేసులో ఏ-2 రాథోడ్‌ పృథ్వీరాజ్‌ సహా పది మందిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు.

Published : 05 Jul 2022 01:21 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించిన కేసులో ఏ-2 రాథోడ్‌ పృథ్వీరాజ్‌ సహా పది మందిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. గత నెల 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ప్రధాన సూత్రధారులుగా భావించిన నిందితులతో పాటు ఘటన కారకులుగా ఇప్పటికే 60మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇందులో ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది.. విధ్వంసానికి దారి తీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ నిమిత్తం ఇప్పటికే 45మందిని రెండు రోజుల కస్టడీకి తీసుకుని విచారించిన జీఆర్పీ పోలీసులు ఆదివారం తిరిగి జైలులో అప్పగించారు. గత నెల 22న అరెస్టయిన ఏ-2 నిందితుడు రాథోడ్‌ పృథ్వీరాజ్‌తో పాటు 10మందిని సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి న్యాయమూర్తి ఆదేశాలతో రెండు రోజుల విచారణ నిమిత్తం మళ్లీ కస్టడీ తీసుకున్నామని జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీను తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని