logo
Published : 05 Jul 2022 01:21 IST

ఆగింది బస్సు.. అప్రమత్తతతో తప్పింది ముప్పు

న్యూస్‌టుడే, తాండూరు: ఎత్తుగా ఉన్న గుట్ట రోడ్డుపై ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా మొరాయించింది. ముందుకు కాకుండా వెనుకవైపునకు కదలడంతో ఒకరిద్దరు ప్రయాణికులు అప్రమత్తమై చక్రాలకు అడ్డంగా రాళ్లను వేయడంతో బస్సు ఆగిపోయింది. ఫలితంగా జరగబోయే పెను ప్రమాదం తప్పినట్లయింది. తాండూరు-వికారాబాద్‌ మార్గ్గంలోని అనంతగిరి గుట్టపై సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు బస్టేషన్‌ నుంచి వికారాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 30 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం వికారాబాద్‌కు బయలు దేరింది. అనంతగిరి మొదటి గుట్టను ఎక్కే సమయంలోనే ఆపసోపాలకు గురైంది. డ్రైవర్‌ కష్టంగా గుట్టను ఎక్కించారు. రెండో గుట్ట ఎక్కే సమయంలో కదల్లేక ముందుకు కాకుండా వెనుకకు వెళ్లడం ప్రారంభించింది. డ్రైవర్‌ విఠల్‌ ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో కొందరు బస్సులో నుంచి వెంటనే కిందకు దిగి వెనుక చక్రాలకు రాళ్లను అడ్డ్డంగా వేయడంతో బస్సు ఆగిపోయింది. ఆ తర్వాత మిగతా ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఖాళీ బస్సును డ్రైవర్‌ గుట్టను ఎక్కించి సాధారణ స్థాయిలో ఉన్న రోడ్డుపై నిలిపారు. ప్రయాణికులు కాలినడకన గుట్టను ఎక్కి బస్సు వద్దకు చేరుకున్నారు. తర్వాత అందులోనే ఎక్కి వికారాబాద్‌ వెళ్లి పోయారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని