logo

కండక్టర్‌పై వేటును నిరసిస్తూ ఆందోళన

ఇటీవల ఇద్దరు కండక్టర్ల మధ్య జరిగిన గొడవతో ఓ కండక్టర్‌ను సస్పెండ్‌ చేయడం, దీనిపై ఇతర కండక్టర్లు ఆందోళన చేసిన ఘటన సోమవారం వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో జరిగింది. డిపోలో విధులు

Published : 05 Jul 2022 01:21 IST

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఇటీవల ఇద్దరు కండక్టర్ల మధ్య జరిగిన గొడవతో ఓ కండక్టర్‌ను సస్పెండ్‌ చేయడం, దీనిపై ఇతర కండక్టర్లు ఆందోళన చేసిన ఘటన సోమవారం వికారాబాద్‌ ఆర్టీసీ డిపోలో జరిగింది. డిపోలో విధులు నిర్వహిస్తున్న పీఆర్‌సీ.రెడ్డి, సుదర్శన్‌ ఇటీవల గొడవ పడ్డారు. వీరి మధ్యన కండక్టర్‌ జీవీకే రెడ్డి జోక్యం చేసుకున్నారు.గొడవ ముగ్గురు మధ్యన పెరిగి కేసు నమోదైంది. విషయం డిపో మేనేజర్‌ దృష్టికి వెళ్లింది. విచారించి డీఎం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సదర్శన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముగ్గురి మధ్య గొడవ జరిగితే ఒకరిని సస్పెండ్‌ చేయటం ఏంటని, సోమవారం ఉదయం కార్మికులందరూ నిరసన వ్యక్తం చేశారు. సస్పెండ్‌ను ఎత్తివేసే వరకు బస్సులను నడిపేది లేదని ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులను నిలిపివేశారు.డిపో మేనేజర్‌ మహేశ్‌కుమార్‌ కార్మికులకు ఎంత సర్ది చెప్పినా వినలేదు. కార్మికులు తగ్గకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కార్మికులు, డిపో మేనేజర్‌ మధ్యన జరిగిన చర్చలతో సస్పెండ్‌ను విరమించుకోవాలని కార్మికులు కోరారు. దీనికి డిపో మేనేజర్‌ సానుకూలంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు