logo

డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురి పట్టివేత

మహారాష్ట్ర నుంచి నగరానికి డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీగాడ్స్‌లోని తన కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీసీపీ సునితారెడ్డితో కలిసి పశ్చిమ మండలం డీసీపీ జోయెల్‌ డేవిస్‌ వివరాలు వెల్లడించారు.

Published : 05 Jul 2022 01:21 IST

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: మహారాష్ట్ర నుంచి నగరానికి డ్రగ్స్‌ తరలిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీగాడ్స్‌లోని తన కార్యాలయంలో నార్కోటిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీసీపీ సునితారెడ్డితో కలిసి పశ్చిమ మండలం డీసీపీ జోయెల్‌ డేవిస్‌ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర, పణె, కడ్‌కీలోని దర్గా వసత్‌ ప్రాంతానికి చెందిన నవనత్‌ అనూప్‌(32) దిల్లీలోని నైజీరియన్‌ దేశస్థుడి నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నాడు. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ నదీం(29) సాయంతో నగరానికి డ్రగ్స్‌ తరలిస్తూ ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఖాజా మొబీనుద్దీన్‌(23)తో పాటు మరో ఐదుగురు తౌహీద్‌ రజా అహ్మద్‌, షమ్షుద్దీన్‌ అలియాస్‌ సామ్‌, సులేమాన్‌, యూసుఫ్‌ అలియాస్‌ పార్టీ, సుమీర్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ డ్రగ్స్‌ని విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ వింగ్‌, ఎస్సార్‌నగర్‌ పోలీసులు సోమవారం ఈఎస్‌ఐ బస్టాపులో నవనత్‌ అనూప్‌, మహ్మద్‌ అబ్దుల్‌ నదీం, ఖాజా మొబీనుద్దీన్‌ను అరెస్టు చేసి 30 గ్రాముల డ్రగ్స్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. నార్కోటిక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, ఎస్సై జీఎస్‌ డైనియల్‌, సైదులు ఇతర సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని