logo

వీడీసీసీ రోడ్లు.. మన్నిక ఎన్నో రెట్లు

గ్రేటర్‌లో గుంతల్లేని రహదారులను సాకారం చేసేందుకు రూ.వందల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రకటించింది. సంప్రదాయ తారు రోడ్ల విషయంలో.. నీటి నిల్వలు తరచుగా ఏర్పడే చోట, లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లో సహజంగా

Published : 05 Jul 2022 01:21 IST

రూ.158 కోట్లతో 448 రోడ్ల పనులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో గుంతల్లేని రహదారులను సాకారం చేసేందుకు రూ.వందల కోట్ల ఖర్చు చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రకటించింది. సంప్రదాయ తారు రోడ్ల విషయంలో.. నీటి నిల్వలు తరచుగా ఏర్పడే చోట, లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లో సహజంగా గుంతలు ఎక్కువగా ఏర్పడతాయి. సమస్యను నివారించేందుకు వీడీసీసీ (వాక్యూమ్‌ డీవాటర్డ్‌ సిమెంట్‌ కాంక్రీటు) రోడ్లను నిర్మిస్తున్నామని జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు వెల్లడించారు. సంప్రదాయ సిమెంటు రోడ్లకన్నా ఎక్కువ నాణ్యతతో వీడీసీసీ రోడ్లు ఎక్కువ మన్నిక ఇస్తాయని వివరించారు. ఈ తరహా రహదారులు నిర్మించిన ప్రాంతాల్లో గుంతల ఊసే లేదని, ఫిర్యాదులు బాగా తగ్గాయని ఇంజినీర్లు స్పష్టం చేశారు. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.158.67 కోట్లతో 146 కి.మీ పొడవైన 448 రోడ్లను నిర్మించాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రూ.10.75కోట్ల విలువైన 29 పనులు పూర్తయ్యాయి. 8 కి.మీ మేర వీడీసీసీ రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. 33 కి.మీ పొడవుతో జరుగుతోన్న రూ.41.16 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని