logo

భాజపాకు రూ. 22.3 లక్షలు.. తెరాసకు రూ. 3.4 లక్షలు

నగరవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఇటీవల ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ యంత్రాగం ఆ మేరకు జరిమానాలు విధించింది. ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా నాలుగు రోజులుగా వచ్చిన ఫిర్యాదులను

Published : 05 Jul 2022 01:21 IST

ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు ఇటీవల ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ యంత్రాగం ఆ మేరకు జరిమానాలు విధించింది. ట్విటర్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా నాలుగు రోజులుగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి.. భాజపాకు రూ.22.3 లక్షలు, తెరాసకు రూ.3.4 లక్షల జరిమానా విధించామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌(ఈవీడీఎం) డైరెక్టరేట్‌ అధికారులు సోమవారం ప్రకటించారు. సోమవారం తక్కువ ఫిర్యాదులొచ్చాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆయా ఫ్లెక్సీలను తొలగించే ప్రక్రియ సర్కిల్‌ కార్యాలయాల ఆధ్వర్యంలో జరుగుతోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని