logo

విద్యుత్తు శాఖలో అవినీతి చేపలు

మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌ విద్యుత్తు ఉపకేంద్రం ఏఈ, సబ్‌ ఇంజినీర్‌ అనిశా వలలో చిక్కుకున్నారు. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లోని ఓ ప్రైవేటు వెంచర్‌లో 2 విద్యుత్తు స్తంభాలు,

Published : 05 Jul 2022 01:53 IST

అనిశాకు చిక్కిన విద్యుత్తు సబ్‌ ఇంజినీర్‌

అశోక్‌, ఏఈ రాజానర్సింగ్‌రావు

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌జిల్లా ఘట్‌కేసర్‌ విద్యుత్తు ఉపకేంద్రం ఏఈ, సబ్‌ ఇంజినీర్‌ అనిశా వలలో చిక్కుకున్నారు. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లోని ఓ ప్రైవేటు వెంచర్‌లో 2 విద్యుత్తు స్తంభాలు, ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను గుత్తేదారు నవీన్‌ ఏర్పాటు చేశాడు. బిల్లు మంజూరుకు ఏఈ పి.రాజానర్సింగ్‌రావు ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.15 వేలు, రెండు స్తంభాలకు రూ.4 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ‘నాకూ రూ.3 వేలు కావాలని’ సబ్‌ ఇంజినీర్‌ అశోక్‌ ఒత్తిడి తెచ్చారు. ఈమేరకు గుత్తేదారు.. అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కార్యాలయంలో ఏఈ రూ.19 వేలు, సబ్‌ఇంజనీర్‌ రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకొనికేసు నమోదు చేశారు. ఉప్పల్‌, మౌలాలీలోని వారి నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని