logo
Published : 05 Jul 2022 01:53 IST

క్వారీ నీటి గుంతలో పడి విద్యార్థి గల్లంతు

చందు నాయక్‌

కొత్తూరు, న్యూస్‌టుడే: క్వారీ నీటి గుంతలోపడి విద్యార్థి గల్లంతైన సంఘటన కొత్తూరు మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్ముల్‌నర్వ తండాకు చెందిన పాత్లావత్‌ శివ కుమారుడు చందూనాయక్‌ (16) మైసిగండిలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మధ్యాహ్నం గ్రామ సమీపంలోని క్వారీ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయినట్లు తెలిసింది. సహాయం కోసం కొద్దిసేపు అరిచిన అతణ్ని సమీపంలోని కొంతమంది గమనించి దగ్గరికి వెళ్లగా..అప్పటికే మునిగిపోయాడు. భారీ గుంతలు కావడంతో అందులోకి దిగేందుకు స్థానికులు సాహసించలేదు. నీటి లోపల పెద్ద బండరాళ్లు, మధ్యలో కంపచెట్లు ఉన్నాయని, అందులో ఇరుక్కునే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసు, అగ్నిమాపక శాఖ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలంలో చందు కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆత్మహత్యకు యత్నించాడా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపారు. సహాయక చర్యలను షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పరిశీలించారు. చందు కుటుంబీకులను ఓదార్చారు. గ్రామానికి ఆనుకుని ఉన్న క్వారీని పూడ్చాలని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. మరో ప్రమాదం జరగక ముందే చర్యలు చేపట్టాలని సర్పంచి అజయ్‌ నాయక్‌డిమాండ్‌ చేశారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని