logo

బోనాలకు నిధులు మంజూరు.. ఆర్థిక సాయానికి దరఖాస్తులు ఇవ్వండి

బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Published : 05 Jul 2022 01:53 IST

మాట్లాడుతున్న తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,

పక్కన మహమూద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని, నగరంలోని ఆలయ కమిటీలు ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈనెల 17న జరిగే సికింద్రాబాద్‌, 24న జరిగే హైదరాబాద్‌ బోనాల ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పరిధిలోనివే కాకుండా ప్రయివేటు దేవాలయాలకూ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. దిల్లీలోని తెలంగాణ భవన్‌లో నిర్వహించే బోనాలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. పలు దేవాలయాలకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఐఅండ్‌పీఆర్‌ సీఐఈవో రాధాకృష్ణ, డీఆర్‌వో సూర్యలత, దేవాదాయశాఖ ఆర్‌జేసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని