logo

పాఠ్య పుస్తకాలు వచ్చేశాయ్‌..

నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పుస్తకాలను నేటి నుంచి సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) రేణుకాదేవి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక శివారెడ్డిపేటలేని బుక్‌డిపోను సందర్శించి పుస్తకాలను పరిశీలించారు.

Published : 05 Jul 2022 01:53 IST

నేటి నుంచి మండలాలకు సరఫరా

పుస్తకాలను వికారాబాద్‌ ఎంఈఓకు అందిస్తున్న

జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలకు పుస్తకాలను నేటి నుంచి సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాధికారిణి (డీఈఓ) రేణుకాదేవి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక శివారెడ్డిపేటలేని బుక్‌డిపోను సందర్శించి పుస్తకాలను పరిశీలించారు. పంపిణీ చర్యల్లో భాగంగా వికారాబాద్‌ ఎంఈఓ బాబుసింగ్‌కు పుస్తకాలను అందించారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలను అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాకు 6.41 లక్షల పుస్తకాలు అవసరం కాగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని బుక్‌ డిపోకు 4లక్షల ఒక వేయిదాకా వచ్చాయి. వీటిని మంగళవారం నుంచి జిల్లాలోని 19 మండల వనరుల కేంద్రాలకు పంపించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చేరవేస్తారు. పుస్తకాలు రావడంతో విద్యార్థులకు ఇబ్బందులు తీరనున్నాయి. ఈసారి నూతనంగా ఒకే పుస్తకంలో తెలుగు ఆంగ్ల భాషకు సంబంధించిన పుస్తకాలను ముద్రించారు. దీంతో విద్యార్థులు ఆంగ్లంలో అర్ధంకాని పాఠ్యాంశాన్ని తెలుగులో చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈసారి ఆంగ్ల మాధ్యమం అన్ని పాఠశాలల్లో ప్రారంభించడంతో విద్యార్థుల చేరికలు అధికమయ్యాయన్నారు. జిల్లాలో 1,073 పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులు 1.22 లక్షల మంది ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని