Gudipudi Srihari: సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Published : 05 Jul 2022 09:12 IST

హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ‘ఈనాడు’ సహా పలు దినపత్రికల్లో శ్రీహరి పనిచేశారు. 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. గుడిపూడి శ్రీహరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని