logo

బక్రీద్‌ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు

నగరంలో సంప్రదాయ వేడుకలను ప్రజలు సామరస్య వాతావరణంలో నిర్వహించుకుంటారని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. ఈనెల 10 నిర్వహించే బక్రీద్‌ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వ వివిధ విభాగాలు సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు.

Published : 06 Jul 2022 02:17 IST

చార్మినార్‌, న్యూస్‌టుడే: నగరంలో సంప్రదాయ వేడుకలను ప్రజలు సామరస్య వాతావరణంలో నిర్వహించుకుంటారని నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. ఈనెల 10 నిర్వహించే బక్రీద్‌ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వ వివిధ విభాగాలు సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. మంగళవారం బక్రీద్‌ వేడుకల ఏర్పాట్లపై సాలార్‌జంగ్‌ మ్యూజియంలో ముస్లిం ప్రముఖులు, ప్రభుత్వ వివిధ విభాగాలతో సమీక్ష జరిగింది. సీపీ మాట్లాడుతూ జంతువుల వ్యర్థాలు రహదారులపై లేకుండా మూడువందల మేరకు ప్రత్యేకంగా శానిటేషన్‌ వాహనాలతో పాటు 55 వాహనాలను పోలీసుస్టేషన్లకు కేటాయించామన్నారు. వ్యర్థాలు సేకరించే నిమిత్తం రెండు లక్షల సంచుల పంపిణీ ఉంటుంటున్నారు. వేడుకల ఏర్పాట్లలో భాగంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పశువులను అక్రమంగా రవాణా చేస్తే పోలీసు అధికారులకు సమాచారం అందించాలన్నారు. బక్రీద్‌తో పాటు బోనాల ఉత్సవాలు సామరస్య వాతావరణంలో కొనసాగడానికి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని