logo

చకచకా లిఫ్టులకు మరమ్మతులు

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మరో వారంలో సాధారణ స్థితికి చేరుకుంటుందని ద.మ. రైల్వే పేర్కొంది. జూన్‌ 17న జరిగిన విధ్వంసంలో స్టేషన్‌లో పలు పరికరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.

Published : 06 Jul 2022 02:17 IST

వారంలో సాధారణ స్థితికి సికింద్రాబాద్‌ స్టేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ మరో వారంలో సాధారణ స్థితికి చేరుకుంటుందని ద.మ. రైల్వే పేర్కొంది. జూన్‌ 17న జరిగిన విధ్వంసంలో స్టేషన్‌లో పలు పరికరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఎస్కలేటర్లు, లిఫ్టుల మరమ్మతుకు కాస్త సమయం పడుతోందని ద.మ. రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు. పాత ఫ్యాన్లన్నింటిని తొలగించి కొత్తవి అమర్చామన్నారు. ఎల్‌ఈడీ లైట్లు, ఫోన్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, వాటర్‌ కూలర్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి పూర్వ స్థితికి తీసుకొచ్చామన్నారు. 3 ఎస్కలేటర్లు, 4 లిఫ్టులు బాగా దెబ్బతినగా, 2 ఎస్కలేటర్లు, ఒక లిఫ్టు వెంటనే వినియోగంలోకి తెచ్చామన్నారు. మిగతావి వారంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని