logo

ఫిట్‌గా ఉండడమే ఆరోగ్యం

ఫిట్‌గా ఉండడమంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనని నగరంలోని ఎక్కువ మంది మహిళలు భావిస్తున్నారు. శారీరకంగా, భౌతికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దాదాపు 94 శాతం మంది మహిళలు ఫిట్‌గా ఉండాలని చెబుతున్నారు.

Published : 06 Jul 2022 02:11 IST

94 శాతం మంది మహిళల అభిప్రాయమిదే

 

ఈనాడు, హైదరాబాద్‌: ఫిట్‌గా ఉండడమంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనని నగరంలోని ఎక్కువ మంది మహిళలు భావిస్తున్నారు. శారీరకంగా, భౌతికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దాదాపు 94 శాతం మంది మహిళలు ఫిట్‌గా ఉండాలని చెబుతున్నారు. ఇందుకోసం మహిళలు ఉదయపు నడక, డైటింగ్‌ను ఓ మార్గంగా ఎంచుకుంటున్నట్లు టెట్లీ గ్రీన్‌ టీ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. హైదరాబాద్‌, ముంబయి, దిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో ‘సంపూర్ణ ఆరోగ్యం’ అనే అంశంపై 30 ఏళ్లు దాటిన 1,500 మంది మహిళల అభిప్రాయాలను సంస్థ సేకరించింది. వారు ఏమన్నారంటే...

* 67 శాతం: ఫిట్‌గా ఉంటే చురుగ్గా, ఉత్సాహంగా, బలంగా, మానసికంగా ఉల్లాసంగా ఉన్నట్లు భావిస్తున్నవారు.

* 26 శాతం: ఫిట్‌నెస్‌కు ఉదయపు నడకకు వెళ్తున్నవారు(కొందరు డైటింగ్‌, జుంబాను ఆచరిస్తున్నారు.)

* 99 శాతం: పోషక విలువలతో కూడిన పానీయాలతో ప్రయోజనం ఉంటుందని నమ్మేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని