logo

ఓయూ టెక్నాలజీ కళాశాలలో ర్యాగింగ్‌

ఉస్మానియా విశ్వవిద్యాలయ టెక్నాలజీ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. వారం రోజుల క్రితం టెక్నాలజీ కళాశాల బాలుర వసతి గృహంలో కొందరు సీనియర్లు మొదటి సంవత్సర విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారు.

Published : 06 Jul 2022 02:11 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ టెక్నాలజీ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. వారం రోజుల క్రితం టెక్నాలజీ కళాశాల బాలుర వసతి గృహంలో కొందరు సీనియర్లు మొదటి సంవత్సర విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్‌ విచారణ కమిటీని నియమించారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌ చేసిన సీనియర్లలో నలుగురు విద్యార్థులను మూడు నెలలు, మరో ఐదుగురిని నెల రోజులపాటు సస్పెండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని