logo

ఏబీవీపీ బంద్‌ విజయవంతం

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతోపాటు, ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన పాఠశాలల బంద్‌ మంగళవారం విజయవంతమైంది.

Published : 06 Jul 2022 02:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతోపాటు, ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ చేపట్టిన పాఠశాలల బంద్‌ మంగళవారం విజయవంతమైంది. పలు ప్రైవేటు పాఠశాలలకు ముందస్తుగా యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. కొన్నిచోట్ల ఏబీవీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి మూయించి వేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర కార్యదర్శి శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు దాటినా విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేయలేదన్నారు.వసతులు కల్పనకు నిధులు మంజూరు చేయలేదన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని