logo

ఏ-2 పృథ్వీరాజ్‌ సహా పది మంది విచారణ పూర్తి

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం ఘటనలో రాథోడ్‌ పృథ్వీరాజ్‌ సహా పది మందిని రెండురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మంగళవారం జైలుకు తరలించారు. జూన్‌ 17న జరిగిన స్టేషన్‌ విధ్వంసం కేసులో అరెస్టై 14రోజుల రిమాండుతో చంచల్‌గూడ జైలులో ఉన్న 60మంది....

Published : 06 Jul 2022 02:11 IST

రైల్వేస్టేషన్‌లో ధ్వంసం కేసులో..


పృథ్వీరాజ్‌ను వైద్య పరీక్షలకు గాంధీకి తీసుకెళ్తున్న జీఆర్పీ పోలీసులు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం ఘటనలో రాథోడ్‌ పృథ్వీరాజ్‌ సహా పది మందిని రెండురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మంగళవారం జైలుకు తరలించారు. జూన్‌ 17న జరిగిన స్టేషన్‌ విధ్వంసం కేసులో అరెస్టై 14రోజుల రిమాండుతో చంచల్‌గూడ జైలులో ఉన్న 60మంది ఆందోళనకారులను దశలవారీగా కస్టడీకి తీసుకుని జీఆర్పీ పోలీసులు విచారిస్తున్నారు. ముందుగా 45మందిని కస్టడీకి తీసుకుని శని, ఆదివారాల్లో విచారించారు. సోమవారం ప్రధాన నిందితుల్లోని ఏ-2 రాథోడ్‌ పృథ్వీరాజ్‌తోపాటు ఏ-3 బింగి రమేష్‌, ఏ-4 రాజా సురేంద్రకుమార్‌, ఏ-5 దేవ్‌సోత్‌ సంతోష్‌, ఏ-6 మహ్మద్‌ సాబర్‌, ఏ-57 పడ్వాల్‌ యోగేష్‌, ఏ-58 బమన్‌ పరుశురాం, ఏ-59 పుప్పల అయ్యప్పచారి, ఏ-60 పసునూరి శివసుందర్‌రెడ్డి, ఏ-61 సురానార్‌లకు కస్టడీకి తీసుకుని విచారించారు. కస్టడీ మంగళవారం సాయంత్రం ముగియడంతో 10మందికి వైద్య పరీక్షలు చేయించి రైల్వే కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆయన ఆదేశాలతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

బెయిల్‌కు పిటిషన్‌!

ఏ-2గా ఉన్న ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం సోనాపూర్‌ చెందిన రాథోడ్‌ పృథ్వీరాజ్‌(22) ఇంటర్‌ పూర్తిచేసి సాయి డిఫెన్స్‌ అకాడమీలో ఆర్మీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. విధ్వంసంలో ఇతడు కీలకపాత్ర పోషించినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావు ఎలా వీరికి మద్దతు కల్పించారనే అంశాలను విచారించినట్లు తెలిసింది. సుబ్బారావుతోపాటు మరో 15మంది సికింద్రాబాద్‌ కోర్టులో బెయిల్‌కు పిటిషన్‌ వేశారు. అది పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని