logo

‘నామమాత్రంగా అధికార భాషా సంఘాలు’

రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార భాషా సంఘాలు నామమాత్రంగానే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అన్నారు.

Published : 06 Jul 2022 02:11 IST


ఉత్సవాలను ప్రారంభిస్తున్న డా.కె.వి.రమణాచారి

నారాయణగూడ, న్యూస్‌టుడే: రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార భాషా సంఘాలు నామమాత్రంగానే ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అన్నారు. నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం, నవ్యసాహితీ సమితిల ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ కళామందిరంలో ‘మహాకవి నండూరి రామకృష్ణమాచార్య’ శతజయంతి మహోత్సవాలు జరిగాయి. ముఖ్యఅతిథి డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూనండూరి తెలుగు భాష కోసం ఎంతో పాటుపడ్డారన్నారు. ఓయూ పూర్వ డీన్‌ ఆచార్య ఎస్‌.వి.రామారావు, కవి నారుమంచి వెంకట అనంతకృష్ణ, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షుడు సాధన నరసింహాచార్య మాట్లాడారు. మరుమాముల దత్తాత్రేయ శర్మ, డా.ఆచార్య ఫణీంద్ర, వి.ఎస్‌.ఆర్‌.మూర్తి, డా.వెల్దండ నిత్యానందరావు, ఉదయబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని