logo

గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి

రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు డిమాండ్‌ చేశాయి. చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.

Published : 06 Jul 2022 02:11 IST


స్వామి స్వయం భగవాన్‌దాస్‌, జస్‌రాజ్‌ శ్రీమల్‌ను సన్మానిస్తున్న జస్మత్‌పటేల్‌. చిత్రంలో రితీశ్‌ జాగిర్దార్‌, ఆర్‌కే జైన్‌, ముఖేష్‌ చౌహాన్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు డిమాండ్‌ చేశాయి. చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల గోవులను అక్రమంగా వధశాలలకు తరలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. మూడు దశాబ్దాలుగా గోసంరక్షణకు కృషి చేస్తున్న భారతీయ ప్రాణిమిత్ర సంఘ్‌ అధ్యక్షుడు జస్‌రాజ్‌శ్రీ శ్రీమల్‌, తెలంగాణ ఎనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు సభ్యుడు స్వామి స్వయం భగవాన్‌దాస్‌లను మంగళవారం కాచిగూడలో తెలంగాణ లవ్‌ఫర్‌కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌కే జైన్‌, ప్రాణమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, జీవదయ ఫౌండేషన్‌ కన్వీనర్‌ ముఖేష్‌చౌహాన్‌లు సన్మానించారు. బక్రీద్‌ సందర్భంగా గోవులను కబేళాలకు తరలించకుండా నిరోధించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని