logo

భాగ్యనగరంలో జడివాన

రాజధానిలో మంగళవారం వరుణుడు విజృంభించాడు. మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన వాన.. అర్ధరాత్రి వరకు ఏదో ఓ ప్రాంతంలో కురుస్తూనే ఉంది.

Published : 06 Jul 2022 02:11 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో మంగళవారం వరుణుడు విజృంభించాడు. మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన వాన.. అర్ధరాత్రి వరకు ఏదో ఓ ప్రాంతంలో కురుస్తూనే ఉంది. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, అత్తాపూర్‌ ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు ఏఎస్‌.రావునగర్‌లో 3.85సెం.మీ వర్షం పడింది. చర్లపల్లిలో 3.5, హెచ్‌సీయూలో 3, నేరెడ్‌మెట్‌లో 2.85, మౌలాలిలో 2.83, హఫీజ్‌పేటలో 2.58, మాదాపూర్‌లో 2.55 సెం.మీ వాన పడింది. బుధవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని