logo
Published : 06 Jul 2022 02:17 IST

నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: జిల్లాలోని విద్యార్థులు, యువతీ, యువకులు రూపొందించే నూతన ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం తెలంగాణ ఇన్నోవేషన్‌ సెల్‌ కల్పిస్తుందని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. 2022 సంవత్సరానికి ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యవసాయదారులు, చేతివృత్తులు చేసుకునే వారు ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయటమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని వివరించారు. ఆవిష్కర్తలు చేసిన పరికరాలకు భవిష్యత్తులో పేటెంట్‌ హక్కులను కల్పించి మార్కెటింగ్‌ చేసి ప్రోత్సహించే అవకాశం ఉందన్నారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి: ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణలకు సంబంధించి ఆరు వాక్యాలు రాయాలని, రెండు నిమిషాలు నిడివిగల వీడియోను, నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నంబర్‌, ప్రస్తుత వృత్తి పూర్తి చిరునామాను 91006 78543 నంబర్‌కు వాట్సప్‌ చేయాలి. గడువు తేదీ ఆగస్టు 5. వచ్చిన అంశాల్లో ప్రతి జిల్లా నుంచి ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి స్వాతంత్య్ర దినోత్సం రోజున ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి ఆర్‌. విశ్వేశ్వర్‌, ఫోన్‌ నంబర్‌ 94400 02515లో సంప్రదించాలని డీఈఓ తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని