logo

చిత్ర వార్తలు

చల్లని వాతావరణం.. అప్పుడప్పుడు చిరుజల్లుల పలకరింపుతో నగరం ఆహ్లాదకరంగా మారడంతో సందర్శకులు విహారానికి మొగ్గు చూపుతున్నారు. హుస్సేన్‌ సాగర్‌లో పడవ ప్రయాణాన్ని యువత ఆస్వాదిస్తున్నారు. రకరకాల బోట్లు అందుబాటులో ఉండడంతో వాటిలో విహరిస్తున్న వారితో సాగర్‌ కళకళలాడుతోంది.

Published : 06 Jul 2022 02:40 IST

సందర్శకుల హుషారు.. బోటులో షికారు

 

చల్లని వాతావరణం.. అప్పుడప్పుడు చిరుజల్లుల పలకరింపుతో నగరం ఆహ్లాదకరంగా మారడంతో సందర్శకులు విహారానికి మొగ్గు చూపుతున్నారు. హుస్సేన్‌ సాగర్‌లో పడవ ప్రయాణాన్ని యువత ఆస్వాదిస్తున్నారు. రకరకాల బోట్లు అందుబాటులో ఉండడంతో వాటిలో విహరిస్తున్న వారితో సాగర్‌ కళకళలాడుతోంది.


పేరుకే కాలి బాట.. నడక కాని మాట

నగరంలో చాలా చోట్ల కాలిబాటలను ఆధునిక మరుగుదొడ్లు, బస్సు షెల్టర్లు, విద్యుత్తు బాక్సులకు ఉపయోగిస్తుండటం కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పాదచారులు రోడ్లపై నడిచి ప్రమాదాల బారిన పడుతున్నారు. యూసుఫ్‌గూడ కూడలిలో కనిపించిన చిత్రమిది


పిల్లలూ.. పుస్తకాలొచ్చేశాయోచ్‌!

ఖైరతాబాద్‌లోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ముద్రణాలయంలో సోమవారం నుంచి పూర్తి స్థాయిలో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సమాచారంతో విద్యార్థులు తల్లిదండ్రులు తరలివచ్చి కావాల్సిన తరగతుల సెట్లను తీసుకెళుతున్నారు.


తటాకంలోకి కాలకూట విషం

రోజూ కురుస్తున్న వర్షాలతో చెరువులకు చేరే కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. ఇదే అదనుగా పరిశ్రమల నిర్వాహకులు రసాయన వ్యర్థాలను కాలువల్లోకి వదులుతున్నారు. దీంతో నీరు విషతుల్యమవుతోంది. సరూర్‌నగర్‌ చెరువు వద్ద నురగలు కక్కుతున్న జలం ఇది.


మయూర సోయగం చల్లటి వాతావరణం.. అప్పుడప్పుడు కురుస్తున్న చినుకులు.. నెమళ్లు పరవశించి ఆడే కాలం.. నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఇలా గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఆహ్లాదపరుస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని