logo

దోమలకు దూరంగా ఉందాం

వర్షాకాల వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ముందు జాగ్రత్తలు పాటించాలని జీహెచ్‌ఎంసీ మంగళవారం పలు సూచనలు చేసింది.

Published : 06 Jul 2022 02:40 IST

 

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాల వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు ముందు జాగ్రత్తలు పాటించాలని జీహెచ్‌ఎంసీ మంగళవారం పలు సూచనలు చేసింది. నీటి నిల్వల కారణంగా దోమల వ్యాప్తి పెరుగుతుందని, కట్టడి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు కమిషనర్‌ డి.ఎస్‌.లోకేశ్‌ కుమార్‌ వెల్లడించారు. డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌ ఎంటామాలజిస్టు (సీఈ) డాక్టర్‌ రాంబాబు గుర్తుచేశారు.

కార్యాచరణ..: ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, డ్రోన్ల ద్వారా చెరువుల్లో దోమల నివారణ మందు పిచికారీ, జ్వరం సర్వే నిర్వహించడం వంటి కార్యక్రమాలు జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. డెంగీ కేసులు నమోదైతే.. రోగి ఇంటిని, చుట్టూ వంద ఇళ్లలో దోమల మందు పిచికారీ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దోమల కట్టడికి 642 బృందాలతో మందు పిచికారీ, ఇంటింటి పరిశీలన జరగనుంది. టైర్లు, పడేసిన కొబ్బరి బోండాలు, రోళ్లు, నీటి ట్యాంకులు, పూల కుండీలు, మట్టి కుండలు, పాత ఫ్రిడ్జ్‌ల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని