HYD News: దొరలకు లాభం చేసేందుకే ‘ధరణి’: వీహెచ్‌

రాష్ట్రంలో దొరలకు లాభం చేసేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత మాజీ ప్రధాని

Updated : 06 Jul 2022 15:02 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో దొరలకు లాభం చేసేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. దున్నేవాడికి భూమి ఇచ్చిన ఘనత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీదే అని చెప్పారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఓఆర్ఆర్ వచ్చిన తర్వాతే భూముల రేట్లు విపరీతంగా పెరిగాయన్నారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పేదల భూములను పెద్దలకు రాసిచ్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్‌ మాట్లాడుతూ.. తెరాసపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలోపు ఉన్న భూములు మాయం చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం హెచ్‌ఎండీఏ కార్యాలయం ముందు నిరసన చేపట్టనున్నట్లు వీహెచ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని