Revanth Reddy: కేసీఆర్‌.. నయా భూస్వాములను తయారు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ...

Published : 06 Jul 2022 18:08 IST

హైదరాబాద్‌: సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తు్న్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భూ బాధితులు తమ సమస్యలను నేతల ముందు ఏకరవు పెట్టారు. పేదల ఆత్మగౌరవంపై కేసీఆర్‌ సర్కారు దాడి చేస్తుందన్నారు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన వారికి సంకెళ్లు వేసి నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను రద్దు చేయడమే మార్గమన్న రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూముల జోలికి రావొద్దని మండిపడ్డారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అసెంబ్లీలో, బయట ప్రభుత్వంపై రైతుల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. భూముల విలువ పెంపకం పేరుతో రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని