Hyderabad: కవర్‌లో కిలో బంగారం.. సుడాన్‌ మహిళ వద్ద పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుడాన్‌కు చెందిన మహిళ నుంచి అక్రమంగా తరలిస్తోన్న కిలోకుపైగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Published : 06 Jul 2022 20:14 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుడాన్‌కు చెందిన మహిళ నుంచి అక్రమంగా తరలిస్తోన్న కిలోకుపైగా విదేశీ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుడాన్‌కు చెందిన మహిళ దుబాయ్‌ నుంచి బుధవారం హైదరాబాద్‌ వచ్చారు. ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్‌ అధికారులు మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. నల్లటి ప్లాస్టిక్‌ కవర్‌లో బంగారాన్ని దాచుకుని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. గాజులు, బిస్కెట్ల రూపంలో ఉన్న దాదాపు 1.237 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ సుమారు రూ.64.38 లక్షలు ఉంటుందని వెల్లడించారు. మహిళను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. బంగారాన్ని హైదారాబాద్‌లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకొచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. నిందితురాలు గతంలో ఎప్పుడూ బంగారం తరలిస్తూ పట్టుబడలేదని ప్రాథమిక దర్యాప్తులో కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని