logo

‘గాంధీ’లో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ కేంద్రం ప్రారంభం

పుట్టిన పిల్లల్లో వినికిడి లోపం గుర్తించి సత్వరం చికిత్స చేసే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ కేంద్రాన్ని బుధవారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రొ.ఎం.రాజారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ప్రసూతి

Published : 07 Jul 2022 02:11 IST

ఇంప్లాంటేషన్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సూపరింటెండెంట్‌ డా.రాజారావు

గాంధీఆసుపత్రి, న్యూస్‌టుడే: పుట్టిన పిల్లల్లో వినికిడి లోపం గుర్తించి సత్వరం చికిత్స చేసే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ కేంద్రాన్ని బుధవారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రొ.ఎం.రాజారావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ప్రసూతి విభాగం ఉండడం వల్ల అప్పుడే పుట్టిన పిల్లల్లో వినికిడి లోపం ఉన్నట్లు నిర్ధారణైతే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌లో చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ రుగ్మత ఉన్న వారిని పరీక్షించేందుకు ఆసుపత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో బుధ, శనివారాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈఎన్‌టీ విభాగాధిపతి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ శోభన్‌బాబు, ఆర్‌ఎంఓ-1 జయకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని