logo

వైఫల్య పాఠాల నుంచే విజయాలు

వైఫల్యాలకు భయపడొద్దని అవి ముందడుగేసేందుకు పాఠాలు నేర్పుతాయని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, యువ పారిశ్రామికవేత్త, ఆరా మహిళా ఆరోగ్య సంస్థ వ్యవస్థాపకురాలు నవ్య నవేలీ నంద అన్నారు.

Published : 07 Jul 2022 02:11 IST

యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓ చర్చాగోష్ఠిలో నవ్యా నవేలీ నంద

నవ్య నవేలి నందాకు జ్ఞాపిక అందజేస్తున్న వైఎఫ్‌ఎల్‌ ఛైర్‌పర్సన్‌ సోనాలి, మెరియా

రాయదుర్గం, న్యూస్‌టుడే: వైఫల్యాలకు భయపడొద్దని అవి ముందడుగేసేందుకు పాఠాలు నేర్పుతాయని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, యువ పారిశ్రామికవేత్త, ఆరా మహిళా ఆరోగ్య సంస్థ వ్యవస్థాపకురాలు నవ్య నవేలీ నంద అన్నారు. రాయదుర్గంలోని ఐటీసీ కోహినూర్‌లో బుధవారం యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(యంగ్‌ ఎఫ్‌ఎల్‌ఓ) నగర విభాగం ఆధ్వర్యంలో యంగ్‌ ఛేంజ్‌ మేకర్స్‌ అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. లైఫ్‌ స్టైల్‌ జర్నలిస్ట్‌ మలిహా ఫాతిమా సంధాన కర్తగా వ్యవహరించిన చర్చాగోష్ఠిలో నవ్యతోపాటు మహిళా హక్కుల న్యాయవాది మాన్సి చౌదరి, వైఎఫ్‌ఎల్‌ఓ అధ్యక్షురాలు సోనాలి మోదీ సరాఫ్‌ పాల్గొన్నారు. నవ్య మాట్లాడుతూ తాను సినీ కుటుంబానికి చెందినప్పటికీ తన తండ్రి పారిశ్రామిక వేత్తని, ఆయనలా పారిశ్రామికవేత్త కావాలనే ఈ రంగంలో అడుగు పెట్టానన్నారు.  అమ్మమ్మ జయాబచ్చన్‌ ధైర్యవంతురాలని ఆమే తనకు స్ఫూర్తి అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని