logo

పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం: సీపీ

పశువుల అక్రమ రవాణా జరుగుతోందని తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ కోరారు.  బక్రీద్‌  దృష్ట్యా బుధవారం నగర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జంతు పరిరక్షణ

Published : 07 Jul 2022 02:06 IST

జంతు పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలతో సమావేశమైన కమిషనర్‌ సీవీ ఆనంద్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: పశువుల అక్రమ రవాణా జరుగుతోందని తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ సీవీ.ఆనంద్‌ కోరారు.  బక్రీద్‌  దృష్ట్యా బుధవారం నగర పోలీసు ఉన్నతాధికారులతో కలిసి జంతు పరిరక్షణ ఉద్యమ కార్యకర్తలు, హిందూ సంస్థల ప్రతినిధులతో నగర పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి పోలీసులు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు.  నగర అదనపు పోలీసు కమిషనర్లు డీఎస్‌.చౌహాన్‌, ఏఆర్‌. శ్రీనివాస్‌, జాయింట్‌ కమిషనర్‌ పి.విశ్వప్రసాద్‌, డీసీపీలు సాయి చైతన్య, ఎన్‌.ప్రకాష్‌రెడ్డి, పి.కరుణాకర్‌, డి.సునీతారెడ్డి, రాధాకృష్ణారావు, జి.చక్రవర్తి, సతీష్‌, ప్రాణమిత్ర (బీపీహెచ్‌ఎస్‌) రితేష్‌ జాగీర్దార్‌, జంతు ప్రేమికులు జస్మత్‌ పటేల్‌, యుగ తులసి అధ్యక్షుడు శివకుమార్‌, తెలంగాణ గోషాల మహేష్‌ అగర్వాల్‌, జ్ఞాన్‌ ఫౌండేషన్‌ నుంచి నితేష్‌, ఆదిత్య, భారతీయ ప్రాణమిత్ర ప్రతినిధి జస్‌రాజ, బీపీఎం నుంచి ముఖేష్‌, వీహెచ్‌పీ నుంచి రామరాజు, వీహెచ్‌పీ తెలంగాణ అధ్యక్షుడు వి.సురేందర్‌రెడ్డి, యాదిరెడ్డి, భజరంగ్‌దళ్‌ నుంచి శివరాములు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని