logo

కమనీయం.. పెద్దమ్మ తల్లి శాకంబరి ఉత్సవం

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లికి అభిషేకం, 6 గంటలకు దర్శనం, మంత్రపుష్పం, హారతి నిర్వహించారు. ఉదయం 8.35

Published : 07 Jul 2022 02:06 IST

అమ్మవారు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 3 గంటలకు పెద్దమ్మతల్లికి అభిషేకం, 6 గంటలకు దర్శనం, మంత్రపుష్పం, హారతి నిర్వహించారు. ఉదయం 8.35 గంటలకు  ఆలయ వ్యవస్థాపక సభ్యుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, ఆచార, బ్రహ్మాది రుత్విగ్వరణము, కంకణ, దీక్షాధారణలు, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, దేవతాహ్వానం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు పల్లకీ సేవ నిర్వహించారు. శాకంబరి అలంకారానికి టన్నుకుపైగా కూరగాయలను ఉపయోగించామని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. ఈ ఉత్సవాలు ఈ నెల 8 వరకు కొనసాగుతాయి.

ఆలయంలో కూరగాయలతో ప్రత్యేక అలంకారం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని